
అనుమతి ఉండాలి
ప్రభుత్వ అనుమతి పొందిన జూనియర్ కళాశాలల వివరాలు జిల్లా ఇంటర్మీడియెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మూడు కళాశాలలకు కొత్తగా అనుమతి వచ్చింది. మరి కొన్నింటికి రావాల్సి ఉంది. అనుమతి లేకుండా ఈ ఏడాది అడ్మిషన్లు చేసుకుని, తరగతులు నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలలో చేరితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం గమనించాలి.
– ఐ.శారద,
జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి
అడ్డూ అదుపూ లేదు
అనేక ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదు. ఈ విషయం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు సైతం తెలుసు. అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొన్ని కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుని, మరో కళాశాలలో చదివినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లు రాయిస్తున్నారు. ఇలాంటి అవకతవకలు చాలా ప్రైవేటు కళాశాలల్లో జరుగుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
– బి.సిద్ధు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి

అనుమతి ఉండాలి