
ఉమ్మడి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా గణేశ్
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా అడారి గణేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పుటి వరకు భీమవరం జిల్లా ట్రెజరీ శాఖలో అసెస్టెంట్ డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా గణేశ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, ఉద్యోగులు కలిశారు.