
వృద్ధుడి గల్లంతు
నిడదవోలు రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలోకి జారిపడి వృద్ధుడు గల్లంతైనట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు శుక్రవారం తెలిపారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఉల్లూరి చిరంజీవి (64) ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు గోదావరి ఒడ్డున బహి ర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. చిరంజీవి అల్లుడు ప్రత్తిపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి గోదావరిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ జగన్నాథరావు శుక్రవారం పరిశీలించారు.