
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ఐ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని టెన్నిస్ కోర్టులలో బాలబాలికల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–14, 17 కార్యదర్శి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలకు 70 మంది హాజరయ్యారు. టెన్నిస్ కోచ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఎంపికల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి మాచరరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, సీనియర్ పీడీలు ఎల్.జార్జి, పట్టాభిరామం పాల్గొన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో త్వరలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపిక నిర్వహించామన్నారు. అండర్–14 బాలురు–5, బాలికలు–5, అండర్–17 బాలురు–5, బాలికలు–5 మందిని ఎంపిక చేశారు. ఎంపికలు ఎస్‌జీఎఫ్‌ఐ బాలికల కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు.