
మహాచండీదేవిగా...
అన్నవరం దేవస్థానంలో కొలువు తీరిన దుర్గామాతలు కూడా మహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రత్నగిరిపై సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీ దేవితో పాటు వనదుర్గమ్మ, తొలి పావంచా వద్ద కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవార్లకు అర్చకులు అష్టోత్తర శత సహస్ర నామార్చన, లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం మహిళలు కనకదుర్గమ్మ ఆలయంలో లలితా పారాయణ చేశారు.
– తొండంగి
లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారు శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఏడో రోజైన ఆదివారం భక్తులకు మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. వేదపండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
– తుని రూరల్

మహాచండీదేవిగా...

మహాచండీదేవిగా...