
● బొమ్మ అమ్మాలి.. బొజ్జ నిండాలి
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు.. బడి బయటి పిల్లలు బడిలోనే ఉండాలంటూ సర్కారు వారు ఊరంత హడావుడి చేస్తూంటారు. పనుల్లో మగ్గిపోతున్న పిల్లలను రెక్క పట్టుకుని మరీ బడుల్లో చేరుస్తారు. ఆరంభ శూరత్వంలా ఆ ఆర్భాటమంతా అక్కడితోనే సరి! ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం.. పిల్లలు సైతం నాలుగు డబ్బులు సంపాదిస్తేనే కానీ ఆ బడుగుల ఆకలి మంటలు చల్లారని దుస్థితి. దీంతో, అనేక మంది చిన్నారులు రకరకాల పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వక తప్పని దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. కాకినాడ మసీద్ సెంటర్‌లో ఆదివారం బుడగలు విక్రయించుకుంటూ ఓ బాలుడు ఇలా జీవన పోరాటం సాగిస్తున్నాడు.
– బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)