
శ్రీ శారదాంబా నమోస్తుతే..
అన్నవరం: దసరా వేడుకల్లో నాలుగో రోజైన గురువారం రత్నగిరి దుర్గామాతలు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లను శారదాదేవిగా అలంకరించారు. ఒక చేత పుస్తకం, మరో చేత గులాబీ, మిగిలిన రెండు చేతులు అభయహస్తాలుగా చూపుతూ దర్శనమిచ్చిన అమ్మవార్లకు పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో రుత్విక్కులు చండీ, సప్తశతీ పారాయణలు, రామాయణ, మహాభారత పారాయణ, మహాలింగార్చన, సూర్యనమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ దుర్గామాతల ఆలయాల్లో రుత్విక్కులు లక్ష కుంకుమార్చనలు చేశారు. రాత్రి 7 గంటల నుంచి సత్యదేవుని ఆలయంలో స్వామి అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించారు.
కాత్యాయనీదేవిగా తలుపులమ్మ తల్లి
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గెడ్లబీడు వీఎల్‌సీ ఫ్యాక్టరీ వద్ద ధారాలమ్మ తల్లికి కూడా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యాన భవానీ భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు.

శ్రీ శారదాంబా నమోస్తుతే..

శ్రీ శారదాంబా నమోస్తుతే..