
‘నన్నయ’లో ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపిక
రాజానగరం: ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థులలో సేవా దృక్పథం, క్రమశిక్షణ, విలువలు, సమాజంపై అవగాహన వంటివి అలవడుతాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలో వెస్ట్ జోన్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ సెలక్షన్స్ బుధవారం జరిగాయి. గోదావరి జిల్లాల నుంచి 190 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు హాజరై, తమ ప్రతిభను కనబరిచారు. ఎన్‌ఎస్‌ఎస్ రీజనల్ డైరెక్టర్ ఎం.రామకృష్ణ మాట్లాడుతూ, ఈ క్యాంప్‌లో ప్రతిభ కనబరిచిన వలంటీర్లను ప్రీ ఆర్డీ క్యాంప్‌కి ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు హైట్, రన్నింగ్ రేస్, మార్చ్‌ఫాస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు, ఇతర టాలెంట్‌ను పరిశీలించడానికి ఇంటర్‌ూయ్వలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ సంజయ్, పీఓలు, పీఈటీలు పాల్గొన్నారు.