
వెల్లివిరిసిన మత సామరస్యం
దసరా అన్న సమారాధనల్లో
ముస్లిం మహిళ సేవలు
అమలాపురం టౌన్: సేవకు కులాలు, మతాలు అడ్డురావడానికి అమలాపురానికి చెందిన ముస్లిం మహిళ మెహబూబ్ షకీలా నిదర్శనంగా నిలుస్తారు. స్థానిక శ్రీదేవి మార్కెట్‌లోని శ్రీదేవి అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు దాతల విరాళాలతో వేలాది మందికి అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ అన్నదానంలో షకీలా మొదటి పంక్తి నుంచి చివరి దాకా తానూ భోజనాలు వడ్డించి సేవలు అందిస్తున్నారు. ఏటా ఈ ఆలయం వద్ద అమ్మ సన్నిధిలో జరిగే అన్నదానాల్లో దసరా తొమ్మిది రోజులూ షకీలా భోజనాలను భక్తులకు కొసరి కొసరి మరీ వడ్డిస్తుంది. ముస్లిం మహిళ అయినప్పటికీ ఆమె ఆలయం వద్ద జరిగే అన్నదాన కార్యక్రమాల్లో సేవలు అందించడాన్ని అందరూ అభినందిస్తున్నారు.