
అందరూ అమ్మ అనుగ్రహం పొందాలి
కాకినాడ రూరల్: లలితా సహస్ర నామ స్తోత్రం 64 లక్షల కోట్ల మంత్రాలతో సమానమని, అటువంటి అమ్మవారిని కొలుస్తూ వెయ్యి కోట్ల కుంకుమార్చనలో పాల్గొన్న తల్లులందరూ అదృష్టవంతులని పరిపూర్ణానంద స్వామిజీ పేర్కొన్నారు. మండలంలోని రమణయ్యపేట శ్రీపీఠంలో బుధవారం మూడో మహాశక్తి యాగం వంద కోట్లు కుంకుమార్చనకు భారీగా మహిళలు తరలివచ్చి కుంకుమ పూజ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ లలితా సహస్ర నామాల విశిష్టత, అమ్మవారి వైభవాన్ని వివరించారు. బుధవారం దేవీ సూక్త, రాజమాతంగి హోమం నిర్వహించారు. సాయంత్రం లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు భక్తులకు శ్రీరాజ మాతంగిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం రాపర్తి గ్రామానికి చెందిన పిన్నమనేని సుధీర్‌రాజు నిర్మాతగా, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచయిత, దర్శకుడిగా సంగీత దర్శకులుగా మణి, నాగరాజు వ్యవహరిస్తూ నిర్మించనున్న చిత్రంలోని మొదటి పాట సీడీని పరిపూర్ణానంద స్వామి ఆవిష్కరించారు.
స్వామి పరిపూర్ణానంద

అందరూ అమ్మ అనుగ్రహం పొందాలి