
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి బుధవారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా సెలవులు కావడం, భవానీ మాలధారులతో పాటు సాధారణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
● సత్యదేవుని దర్శించిన 25 వేల మంది
● దేవస్థానం ఆదాయం రూ.30 లక్షలు