
పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
సామర్లకోట: శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని సామర్లకోట పంచారామ క్షేత్రంలో రెండో రోజైన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమారారామ భీమేశ్వరస్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యాన ఉదయం, సాయంత్రం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో చండీహోమం నిర్వహించారు.
అన్నపూర్ణమ్మగా
బాలాత్రిపురసుందరీదేవి
సామర్లకోట: శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా సామర్లకోట పంచారామ క్షేత్రంలో వేంచేసియున్న బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు మంగళవారం అన్నపూర్ణ స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
వైఎస్సార్ సీపీకి ముద్రగడ
కృషి ఎంతో అవసరం
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడి లోని ఆయన నివాసంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముద్రగడ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుతో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కృషి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరి, లాలం బాబ్జీ, నాగం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో 2డీ ఎకో
సేవలు పునఃప్రారంభం
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో 2డీ ఎకో సేవలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఎన్‌టీఆర్ వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ వానపల్లి వరప్రసాద్ ఈ విషయం తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆదేశాల మేరకు, ఇన్‌సోర్సింగ్ విధానంలో కార్డియాలజిస్టులను ఆసుపత్రికి తీసుకొచ్చి రోగులకు 2డీ ఎకో సేవలు అందిస్తున్నామని వివరించారు. దీని ద్వారా హృద్రోగాలతో బాధపడుతున్న వారికి తొలి దశ వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తొలి రోజు 30 మందికి 2డీ ఎకో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు

పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు

పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు