
పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి
కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరు పెట్టాలి. ఆయన తెలుగు భాషకు చిరస్మరణీయమైన రచనలు అందించి, గొప్ప సంస్కరణవాదిగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహనీయుడు. విద్యాభివృద్ధితో పాటు దళిత జనోద్ధరణకు విశేషంగా కృషి చేశారు. తెలుగు భాషా వికాసానికి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కవులు, రచయితలను శ్రీకృష్ణదేవరాయలు తరువాత అదే స్థాయిలో ఆదరించి, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. తెలుగు ప్రాంతంలో సాంస్కృతిక వికాసానికి దోహదం చేసి ఆయన పేరును జిల్లాకు పెట్టడం సముచితం.
– నల్లమిల్లి శేషారెడ్డి, చాన్సలర్, ఆదిత్య యూనివర్సిటీ
ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు
పిఠాపురం మహారాజా 1852లో కాకినాడలో పీఆర్ హైస్కూల్‌ను స్థాపించారు. అప్పట్లో బాలికా విద్యకు అవకాశం కల్పించారు. 1884లో పిఠాపురం రాజా కళాశాలను స్థాపించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం స్థాపించిన విద్యా సంస్థలకు భారీ విరాళం ఇచ్చారు. కాకినాడలో బ్రహ్మసమాజ మందిరం, అనాథ శరణాలయం తదితర ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాకినాడలో 100 ఏళ్ల క్రితం పీఆర్ డిగ్రీ కళాశాల, పిఠాపురంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వేలాది మంది విద్యార్థుల విద్యాభ్యున్నతికి బాట వేశారు. విద్యార్థి లోకంతో పాటు అటు అధ్యాపక సంఘాలు కూడా పిఠాపురం రాజా పేరు పెట్టాలని కోరుతున్నాయి.
– వలవల శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, పీఆర్ డిగ్రీ కళాశాల

పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి