
బార్ తొలగించాలని ఆందోళన
నిడదవోలు : పట్టణంలో సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన చైతన్య బార్ – రెస్టారెంట్ తొలగించాలని స్థానికులు మంగళవారం బార్ వద్ద ఆందోళన చేశారు. దళితులు, శ్రామికుల కుటుంబాలను దోచుకోవటానికే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మద్యం బార్లు తెరుస్తున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బైపే రాజేశ్వరరావు, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, టి.ప్రేమ్‌కుమార్ ఎం. భాను, బి.నాని, నక్కా సురేష్, గుమ్మడి రాజు, ఎం.డేవిడ్ వి. పవన్ కుమార్, వి. కళ్యాణ్, జాన్, పుల్లారావు పాల్గొన్నారు.