
భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లిలో భార్యపై హత్యాయత్నం చేసిన భర్తపై కె.గంగవరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కె.గంగవరం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోహమాటి అశ్విని, రామచంద్రపురం పట్టణానికి చెందిన దత్త వీర వెంకట శివకుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల శివకుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ నేపథ్యంలో అశ్విని కోటిపల్లిలో అమ్మగారి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఇదే క్రమంలో సోమవారం రాత్రి శివకుమార్ దళిత కాలనీలో ఉన్న అశ్విని వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆమెను కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై భార్య అశ్విని ఫిర్యాదు చేయగా కె.గంగవరం ఎస్సై జానీ బాషా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై రామచంద్రపురం ఇన్‌చార్జి డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శివకుమార్‌ను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.