
రోగి నుంచి వివరాల సేకరణ
గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడుకు చెందిన గరగ నాగ ఆంజనేయ దుర్గారావును వైద్య, ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది కలిసి అతనికి ఉన్న అనారోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. శ్రీసాక్షిశ్రీలో మంగళవారం ప్రచురించిన శ్రీసాయమందించి ప్రాణభిక్ష పెట్టండిశ్రీ కథనానికి స్పందించారు. గండేపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి కేవీ నరేష్, సీహెచ్‌ఓ శర్మ, ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది నాగేశ్వరరావు, ఏఎన్‌ఎం రామలక్ష్మి, ఆశ లక్ష్మి మంగళవారం దుర్గారావు ఇంటికి వెళ్లి వ్యాధి వివరాలు అడిగి తెలుసుకుని ఇందుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించి తగు సూచనలు, సలహాలు అందజేశారు.

రోగి నుంచి వివరాల సేకరణ