
ముగిసిన సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికలు
తాళ్లరేవు: కాకినాడ జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా సీనియర్ పురుష, మహిళల జట్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. చొల్లంగి జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన ఎంపికలకు కాకినాడ జిల్లా నుంచి 40 మంది పురుషులు, 30 మంది మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, కార్యనిర్వాహక కార్యదర్శి వి.నీలిమ, సీనియర్ వ్యాయామోపాధ్యాయులు ధనలక్ష్మీ కుమారిల సమక్షంలో జరిగిన ఈ పోటీలలో ప్రతిభ కనబరచిన 8 మంది పురుషులు, 8 మంది మహిళలను కాకినాడ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. పురుషుల జట్టులో లివేష్, వినయ్, కేఎస్ నారాయణ, రాజేంద్రప్రసాద్, సాత్విక్, బద్రేష్, తేజ, సన్నీ, మహిళల జట్టుకు మానవి, మానస, తేజస్వి, శాన్వి, దివ్యజ్యోతి, బ్లెస్సీ, పద్మ, బిఎస్‌ఎస్ లక్ష్మిఐశ్వర్య ఎంపికై నట్లు నీలిమ తెలిపారు.