
యువకుడి మృతదేహం స్వాధీనం
పెదపూడి: పెదపూడికి చెందిన ఒక యువకుడి మృతదేహాన్ని పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై ఎస్.తులసిరామ్ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి గ్రామానికి చెందిన కె.వీరరాఘవేంద్ర(22), జి.మామిడాడ గ్రామానికి చెందిన యు.అనుకుమార్, స్టాలిన్, అభిలాష్, విజయకుమార్ స్నేహితులు. వీరరాఘవేంద్ర వరి కోత యంత్రంపై ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిలో అనుకుమార్ కొంతకాలం క్రితం ఒక ప్రమాదంలో మృతి చెందాడు. మృతి అనంతరం అనుకుమార్ భార్యతో వీరరాఘవేంద్ర వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అనుకుమార్ సోదరులైన స్టాలిన్, అభిలాష్ వీరరాఘవేంద్ర వ్యవహారంపై కోపం పెంచుకున్నారు. దీంతో ఈ నెల 21వ తేదీ సాయంత్రం జి.మామిడాడ మెయిన్‌రోడ్డు సెంటర్లో వీరరాఘవేంద్ర ఉండటాన్ని వారు గమనించి గాజు సీసాలతో దాడికి పాల్పడ్డారు. అనంతరం గాయాలపాలైన అతన్ని మోటార్ బైక్‌పై ఎక్కుంచుకుని తీసుకునిపోయారు. ఈ ఘటనపై వీరరాఘవేంద్ర తల్లి వరలక్ష్మి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే దర్యాప్తు లో భాగంంగా దాడికి గురై గాయాలపాలైన వీరరాఘవేంద్ర మృతదేహం సోమవారం సాయంత్రం అన్నవరం గ్రామంలో లభ్యమైందన్నారు. వెంటనే పోలీసు లు మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై ఎస్సై తులసిరా మ్‌ను వి వరణ కోరగా వీరరాఘవేంద్ర ఏవిధంగా చనిపోయా డో లేక హత్యకు గురయ్యాడో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, వివరాలు తెలియజేస్తామని చెప్పారు.