
నాందీ ఫౌండేషన్‌తో నన్నయ ఎంఓయూ
రాజానగరం: నాందీ ఫౌండేషన్‌తో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సోమవారం ఇందుకు సంబంధించిన పత్రాలపై వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఏపీలో తొలిసారిగా శ్రీనన్నయశ్రీ వర్సిటీతో నాందీ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందని వీసీ తెలిపారు. దీని ద్వారా యూనివర్సిటీ క్యాంపస్‌తోపాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లు, అనుబంధ కళాశాలల్లోని 22 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధితోపాటు ఉద్యోగావకాశాలకు అవసరమైన శిక్షణను ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.