
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకు కృషి
ఈటీసీ ప్రిన్సిపాల్ ప్రసాదరావు సూచన
సామర్లకోట: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుకు కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో టీఓటీలుగా ఎంపిక చేసిన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు సుస్థిరాభివృద్ది లక్ష్యాలపై శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. టీఓటీలకు మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న టీఓటీలు ఆయా మండలాలకు వెళ్లి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. 11 జిల్లాలో 300 మందికి శిక్షణ ఇవ్వవలసి ఉండగా ఆరవ బ్యాచ్‌తో శిక్షణ పూర్తి అవుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పేదరికం లేని గ్రామాలు, ఆకలి నిర్మూలన, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతీ గ్రామంలో అమలు జరిగే విధంగా చూడాలన్నారు. గ్రామాలల్లో ప్రజలందరిని ఆరోగ్యంగా ఉంచటం ద్వారా మంచి గ్రామాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రజల్లో పోషకాహర లోపాలను గుర్తించడం, కౌమారఽ దశలో ఉన్న బాలికలు, సీ్త్రలలో రక్త హీనతను తొలగించడం, తక్కువ బరువు కలిగిన పిల్లలను గుర్తించవలసి ఉంటుందన్నారు. ఈ మేరకు ఈ పనులను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ చేయవలసి ఉంటుందని చెప్పారు. స్థానికంగా సేకరించిన తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. మాతాశిశు మరణాలు లేకుండా చేయాలని సూచించారు. ఈ మేరకు హెల్త్ సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన, పోషకమైన మధ్యాహ్న భోజనం అందించే విధంగా చూడాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ ఆయుష్ మిషన్, ఐసీడీఎస్ అనుబంధ పథకాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్‌లు పంచాయతీ స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ ఫ్యాకల్టీలు డి.శ్రీనివాసరావు, కె.సుశీల, ఎస్‌ఎస్ శర్మ, ఎం. చక్రపాణిరావు, కేఆర్ నిహారిక, పి.రామకృష్ణ, వి.జగన్నాథం, ఎం.రాజ్‌కుమార్ శిక్షణ నిర్వహించారు.