
రాష్ట్ర స్థాయి పోటీలకు జట్ల ఎంపిక
పెదపూడి: రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్–19 బాస్కెట్‌బాల్, బాలీబాల్, బాడ్మింటన్ పోటీలకు బాలురు, బాలికల విభాగాల్లో జట్లు ఎంపిక చేశామని ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్‌రెడ్డి అన్నారు. జి.మామిడాడ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఎంపికలు పాఠశాల హెచ్‌ఎం అప్పలచారి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమాన్ని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుగ సూర్యకుమారి, కాకినాడ డివిజనల్ ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఎంపికల్లో సుమారు 400 బాలురు, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పూర్వ క్రీడాకారుల సంఘం అధ్యక్షుడు సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి, ఇల్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పప్పు శ్రీనివాసరెడ్డి, రామచంద్రపురం ఎంఈఓ తాడి వీర రాఘవరెడ్డి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మాజీ అధ్యక్షుడు లంక జార్జ్ స్కూల్ గేమ్స్ సెక్రెటరీ సుధ, పుర్వ క్రీడాకారులు మల్లిడి శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మణులు పాఠశాల పిడి నల్లమిల్లి అప్పారెడ్డి, దీప్తి ఎస్తేర్, యువ రాజారెడ్డి, బులిగంగిరెడ్డి, గౌరీ శంకర్‌రెడ్డి, పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు జట్ల ఎంపిక