
మోడ్రన్ పెంటాథలాన్ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం అంతర్ జిల్లాల మోడ్రన్ పెంటాథలాన్, బయాథలాన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మోడ్రన్ పెంటాథలాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెంటాథలాన్ అనే ఒలింపిక్ క్రీడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మోడ్రన్ పెంటాథలాన్ పోటీలు డీఎస్‌ఏలో జరుగుతున్నాయని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గౌరవ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బీఎస్‌ఎస్ కుమారి, కోచ్ కట్టా జగన్ మోహన్ కిశోర్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, వి.మాచరరావు, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి ప్రసాద్, బీఎస్‌వీఎస్ ప్రసాద్, డీఎస్‌ఏ స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు పాల్గొన్నారు.