
భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించాలి
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం ఇటీవల విడుదలైన డీఎస్సీలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ గుంటూరి శ్యామ్ మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే డీఎస్సీలో 712 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి వారు జీవితాల్లో స్ధిరపడడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ద్వారా సామాజిక సేవ చేయాలన్నారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో బెండపూడి ప్రసాద్ మాస్టారు పాల్గొన్నారు.