
తిరుపతికి విమాన సేవలు
అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభం
కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎలయన్స్ ఎయిర్ సంస్థ ఏటీఆర్ 72 విమానం అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం 7.40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9.25 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు. తిరిగి 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి మధ్యాహ్నం 11.20 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో ఈ విమాన సేవలు ఉంటాయని వివరించారు. కాగా.. గతంలోనే తిరుపతికి మధురపూడి నుంచి విమాన సర్వీసు ఉండేది. కొంత కాలం తర్వాత ఆగిపోయింది. తిరిగి పునః ప్రారంభం అవుతోంది.