
విభిన్న ప్రతిభ
లోకవరపు శిరీష విభిన్న ప్రతిభ ప్రదర్శించి డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా, ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయింది. చిన్నప్పటి నుంచి ఎన్నోకష్టాలను చవిచూసిన శిరీష వివాహం జరిగినప్పటికీ కృషి, పట్టుదలతో మొదటి ప్రయత్నంలోనే రెండు ఉద్యోగాలను సాధించింది. పుట్టింట, మెట్టినింట నుంచి ప్రోత్సహం లభించడం వల్లే ఈ విజయాలను సాధించినట్టు ఆమె పేర్కొన్నారు.
– లోకవరపు శిరీష
ప్రతిబంధకాలే ప్రేరణ
చదువుకునే రోజుల్లో ఎదురైన అడ్డంకులు ప్రతిబంధకాలే ప్రేరణగా, పట్టుదలతో డీఎస్సీలో గణిత విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా విజయం సాధించాను. చిన్పప్పటి నుంచి అంకెలు, లెక్కలపై ఉన్న మక్కువతో చదువుకుంటూనే వందల మందికి ట్యూషన్లు చెప్పాను. నిరంత కృషి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో డీఎస్సీ పరీక్షల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను.
– రెడ్డి గంగాధర్
అర మార్కులో చేజారింది
చిన్నతనం నుంచి విద్యలో ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ 2018 డీఎస్సీలో అరమార్కుతో ఉద్యోగం చేజారిపోయింది. నిరాశ చెందకుండా ఉపాధ్యాయుడిని అవ్వాలన్న కల 2025 డీఎస్సీలో నెరవేరింది. తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో పాటు తన ప్రతిభ, లక్ష్యంతో ఓపెన్ కేటగిరిలో 89 మార్కులతో ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించాను. మరోసారి విఫలం కాకూడదన్న అసాధారణ శ్రమే గెలిపించింది. – శెట్టి నాగేశ్వరరావు

విభిన్న ప్రతిభ