
వైఎస్సార్‌కు పిండ ప్రదానం
అనపర్తి: మహాలయ అమావాస్యను పురస్కరించుకుని అనపర్తికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఆదివారం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవులో గోదావరి ఒడ్డున ఈ కార్యక్రమం జరిపారు. అలాగే తన కుమారుడు సురేష్ రెడ్డి, తల్లి బాపాయమ్మతో పాటు సర్ ఆర్థర్ కాటన్, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, తన రాజకీయ గురువు సత్తి వీర్రెడ్డి, సహచరుడు మోకా సూరిబాబులకు కూడా పిండ ప్రదానం చేశారు.