
యువతకు స్ఫూర్తి
స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే తలచిన ఆశయం సాధించడం సులభమేనని ఆ దంపతులు నిరూపించారు. నారపాటి నాగేశ్వరరావు, భార్య లీలా శివజ్యోతి జిల్లా డీఎస్సీ ఫలితాల్లో నాగేశ్వరరావు 17వ ర్యాంకు, లీలా శివజ్యోతి రెండో ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్లగా ఎంపికై ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కష్టాలు, వివాహ బంధాలు లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డురావని భార్యాభర్తలు నిరూపించారు.
– ఎన్.నాగేశ్వరరావు, లీలా శివజ్యోతి
(భార్యాభర్తలు)
తెలుగు, హిందీ ఉద్యోగాల్లోకి వదినామరదళ్లు
2025 డీఎస్సీలో లోకవరపు అప్పలనాయుడు భార్య మంగాదేవి హిందీ, సోదరి శెట్టి కుమారి తెలుగు విభాగాల్లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మహిళల్లో దాగి ఉన్న శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేసింది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, జీవిత భాగస్వాముల ప్రోత్సాహమే తమ విజయ రహస్యాలుగా పేర్కొన్నారు.
– లోకవరపు మంగాదేవి,
శెట్టి కుమారి (వదినామరదళ్లు)

యువతకు స్ఫూర్తి