
అంతర్జాతీయ నాటక ప్రదర్శనకు శ్రీప్రకాష్ విద్యార్థులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీప్రకాష్ కాకినాడ సినర్జీ స్కూల్ విద్యార్థులు కజకిస్తాన్ దేశంలో విభిన్న ప్రదర్శనలు ఇవ్వడానికి ఆదివారం పయనం అయ్యారు. వీరు కజకిస్తాన్ వర్సిటీ, షిమ్‌కెంట్లో, కజికిస్తాన్ తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ యూనివర్సిటీలలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నటుడు, దర్శకుడు, విద్యావేత్త నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి కుమార్ సుమిత్ రూపకల్పన, దర్శకత్వంలో కింగ్‌లియర్, జూలియస్ సీజర్ వంటి క్లాసిక్ స్పియర్ నాటక ప్రదర్శనతో ప్రతిభ చూపనున్నారు. విద్యార్థులు సి.సాయిశృతి, ఎన్.ఐశ్యర్య, పి.దక్షిత, ఎన్.షణ్ముకి, కె.శ్రీసాన్వి, ఎం.ఫణి, పి.మణిరాజు, ఎండీ ఇబ్రహీం, డి.అహిల్, పి.శ్రీచరణ్‌రాజ్, సి.నమిత ఆర్యన్, జె.వివేక్‌ల బృందం వెళ్లారు. 23వ తేదీ మంగళవారం ఆల్‌మాటి టీజీ కజక్ నేషనల్ అకాడమీలో ఆఫ్ ఆర్ట్స్‌లో కింగ్ లియర్ ప్రదర్శన, 24వ తేదీన జూలియస్ సీజర్, 25న భారత రాయబార అధికారులు, విద్యార్థులతో సమావేశం, 28న షిమ్‌కెంట్‌లో నజర్‌బాయేవ్ ఇంటలెక్చువల్ స్కూల్లో కింగ్ లియర్ గ్రాండ్ షో, 29న అదే స్కూల్లో జూలియస్ సీజర్ ప్రదర్శన, అక్టోబర్ 1న తాష్కెంట్‌లో ప్రదర్శన ఉంటుందని పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ వివరించారు.