
ఉద్యమం ఉధృతం చేస్తాం
విద్యుత్ శాఖ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరుతూ ఈ నెల 15 నుంచి వివిధ రూపాల్లో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ప్రస్తుతం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– జగత అచ్యుతరామయ్య, చైర్మన్,
విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ,
బొమ్మూరు (రాజమహేంద్రవరం)
ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. ఉపాధ్యాయులకు, విద్యారంగ పరిరక్షణ కోసం చేసే పోరాటాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి. ఈ నెల 25న సుమారు 10 వేల మందితో విజయవాడలో రణభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం.
– ఎస్.జ్యోతిబసు, రాష్ట్ర కార్యదర్శి,
యూటీఎఫ్, రావులపాలెం

ఉద్యమం ఉధృతం చేస్తాం