
ఆపదలో ఆడపడుచులు!
రాజానగరం: ఏటా వలస పక్షుల ప్రస్తావన వచ్చినపుడల్లా ఠక్కున గుర్తొచ్చేవి స్థానిక ‘పుణ్యక్షేత్రం’ ఆడపడుచులే. అవునండీ.. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ‘పుణ్యక్షేత్రం’ గ్రామానికి వచ్చే పక్షులను ఆ ఊరి ప్రజలు తమ ఆడపడుచుల్లా ఆదరిస్తారు. రాజమహేంద్రవరం సమీపాన ఉన్న ఈ గ్రామానికి విహంగాల వల్లే ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇక్కడకు వచ్చే పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇందుకు ఊళ్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లూ ఓ కారణమే. ఈ పక్షులు ఆవాసంగా ఎంచుకున్న కంచి విత్తనం చెట్లను ఆనుకున్న 33 కేవీ విద్యుత్ లైన్లు వాటి పాలిట మృత్యుపాశాలుగా మారాయి. అవి గాల్లోకి ఎగిరే సమయంలో రెక్కలు ఆ తీగలకు తగిలి అంతలోనే నేలరాలుతున్నాయి.
ఖండాంతరాలు దాటి..
ఆసియా ఖండపు ఉత్తర ప్రాంతం రష్యాలోని సైబీరియా నుంచి ఏటా క్రమం తప్పకుండా వచ్చే ఈ పక్షులను శ్రీసైబీరియన్ క్రేన్స్‌శ్రీ అంటారు. రష్యాలోని ఆర్కిటిక్ టండ్రాలో తూర్పు, పశ్చిమ జాతులుగా ఉన్న ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం తూర్పు జాతులు చైనాకు, పశ్చిమ జాతులు భారత్ వైపు వలస వెళతాయి.
మృగశిర కార్తెలో రాక
తొలకరి పడే సమయం(మృగశిర కార్తె)లో వలస వచ్చి, మాఘమాసంలో స్వస్థలాలకు తిరిగి వెళ్లే ఈ పక్షులను స్థానికులు చిల్లు ముక్కు కొంగలు, నత్తకొట్లు, ఓపెన్ బిల్ బర్డ్స్ అని పిలుస్తారు. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభిస్తుంటారు. అవి రాకుంటే తొలకరి సాగదేమోనని ఆందోళన చెందుతారంటే వాటితో అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. తాతముత్తాతల కాలం నుంచి వలస వచ్చే ఈ పక్షులను పుణ్యక్షేత్రం వాసులు పుట్టింటికి వచ్చే ఆడపడుచుల్లా ఆదరిస్తారు. ఇక్కడే సంతానోత్పత్తి చేస్తాయి కాబట్టి అవి తమ ఆడపడుచులని అక్కడి వారంతా అంటుంటారు. పొలాల్లో నత్తలను, పురుగులను తింటూ తమకు సాయపడుతుంటాయని రైతులు చెబుతున్నారు.
ఊరి చెరువు గట్టే ఆవాసం
గ్రామంలోని ఊరి చెరువు గట్టే వీటికి ఆవాసం. ఈ గట్టు చుట్టూ విస్తారంగా పెరిగిన కంచి చెట్లపై గూళ్లు పెట్టుకుని, సంతానోత్పత్తి చేసుకుంటాయి.
పక్షులంటే ఒప్పుకోని ప్రజలు
ఏటా తగ్గుతున్న వలసల సంఖ్య
పైసా ఖర్చుచేయని అటవీ శాఖ
మృత్యుపాశాలుగా హెచ్‌టీ లైన్లు

ఆపదలో ఆడపడుచులు!

ఆపదలో ఆడపడుచులు!