
మోటారు సైకిళ్ల దొంగ అరెస్ట్
కాకినాడ రూరల్: సర్పవరం పోలీసులకు మోటారు సైకిళ్ల దొంగ పట్టుబడ్డాడు. 20 ఏళ్ల వయసులోనే చాకచక్యంగా బైక్‌ల చోరీల్లో ఆరితేరాడు. సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన పెంకే తేజను సోమవారం నిందితుడిని సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను ఎస్సై శ్రీనివాస్‌కుమార్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. నిందితుడి నుంచి రూ.6.5 లక్షల విలువైన 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన క్రైమ్ సిబ్బంది హెచ్‌సీలు సత్తిబా బు, రాజు, గణేష్, పీసీలు రవి, శ్రీనివాస్, అనిల్, చి న్నబాబు, కిశోర్‌లను సీఐ పెద్దిరాజు
అభినందించారు.