
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● టేకు రథంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు 1,600 నిర్వహించారు. ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
ఘనంగా సత్యదేవుని రథసేవ
ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు