ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం

Sep 4 2025 10:51 AM | Updated on Sep 4 2025 10:51 AM

ముగ్గ

ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం

పెరుమాళ్లపురం స్కూల్‌

అసిస్టెంట్‌ ప్రవీణ్‌కుమార్‌

తొండంగి: మండలంలోని పెరుమాళ్లపురం జెడ్పీ హైస్కూలు ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ బొబ్బాది ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికై నట్టు ఆ పాఠశాల హెచ్‌ఎం చాట్రాతి సత్యనారాయణ బుధవారం తెలిపారు. గతంలో పాఠ్య పుస్తక రచయితగా, ఉత్తమ టీఎల్‌ఎం నిపుణుడిగా, ట్రైనింగ్‌ రీసోర్స్‌ పర్సన్‌గా ఆయన ఎన్నో అవార్డులు పొందారన్నారు.

కాకినాడ రూరల్‌: డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకని ఏటా నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఉత్తమ పురస్కారాలకు ఎన్నికయ్యారు. కాకినాడకు చెందిన కోటంరాజు గాయత్రి మూడు దశాబ్దాల పాటు చేసిన విద్యా సేవకు ఈ పురస్కారం దక్కింది. ఆమె ఎటువంటి దరఖాస్తు చేసుకోనప్పటికీ లీప్‌ యాప్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఇంద్రపాలెంలో నివసిస్తున్న గాయత్రి కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలగా తయారు చేసి ఐదు ల్యాబ్‌లను, ప్లే ఫీల్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆమె కృషి చేశారు. తుని మండలం తేటగుంట జెడ్పీ హైస్కూల్‌లో 1995 జూన్‌ 29న ఉపాధ్యాయినిగా తన వృత్తిని ప్రారంభించి, 2009లో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయినిగా పదోన్నతి పొందారు. 2014లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందకున్నారు. తేటగుంట, పెదపూడి మండలం ఎల్‌ఎన్‌ పురం, కాకినాడ అర్బన్‌ పీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. గెజిటెడ్‌ హెచ్‌ఎంగా కిర్లంపూడి మండలం సోమవరం, పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో పని చేసి, 2023 నుంచి రమణయ్యపేటలో పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికై న గాయత్రిని డీఈఓ రమేష్‌, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

కొమరగిరి నుంచి రవిశంకర్‌

కొత్తపల్లి: రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకున్న వారిలో కొత్తపల్లి మండలం ఉప్పాడలోని కొమరగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పతివాడ రవిశంకర్‌ ఒకరు. గణిత అవధానిగా, పాఠ్య పుస్తక రచయితగా, మాడ్యూల్‌ రైటర్గా, స్టెమ్‌ ల్యాబ్‌ డిజైనర్‌గా పలు విద్యా సేవలు అందించడంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఏలేశ్వరం స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌, స్నేహస్తం, చేయూత, లయన్స్‌ క్లబ్‌ కాకినాడ ఎలైట్‌ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సైతం ఆయన సామాజిక సేవ చేస్తున్నారు. గత మూడేళ్లుగా జాతీయస్థాయిలో గణిత అభ్యసన సామగ్రితో పురస్కారాలు అందుకుంటున్నారు. బోధన అభ్యసన సామగ్రి తయారు చేయడం, వాటిని ఎలా తయారు చేయాలి.. ఎలా ఉపయోగించాలనే అంశాలపై వర్క్‌ షాపులు నిర్వహించడం చేస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు ఆటల పాటల ద్వారా వినూత్నంగా విద్యా బోధన చేస్తున్నారు. గణిత క్రికెట్‌, గణిత హౌసి, టేబుల్‌ అంత్యాక్షరి, మ్యాజిక్‌ స్క్వేర్‌ డాన్స్‌ వంటి అనేక వినూత్న విధానాలతో పిల్లల ఆకట్టుకోవడమే కాక సైన్స్‌ ఫెయిర్లకు పిల్లలను రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకునేలా చేశారు.

ఎన్‌ఎంఎంఎస్‌, ఐఐఐటీలలో సీట్లు పొందడంలో విద్యార్థులకు అండగా నిలిచారు. అంతే కాకుండా విద్యార్థులకు విజ్ఞాన, విహారయాత్రలే కాక సేవను కూడా అలవాటు చేసే లక్ష్యంతో లియో క్లబ్‌లను ఏర్పాటు చేసి సేవపై అంకితభావాన్ని తెలియజేశారు. ఏపీఎంఎఫ్‌ బాధ్యుడిగా ఉంటూ గణిత ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ తనకు తోచిన విషయాన్ని నలుగురికి తెలియజేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తెలియని విషయాన్ని నేర్చుకుంటూ గణిత సేవలో నిమగ్నమయ్యారు.

ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం1
1/2

ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం

ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం2
2/2

ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement