
నాస్కామ్‌తో జేఎన్‌టీయూకే ఒప్పందం
బాలాజీచెరువు: ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఇనిషియేషన్ అమలు చేసేందుకు జేఎన్‌టీయూ కాకినాడ, నాస్కామ్ మధ్య బుధవారం ఒప్పందం జరిగింది. స్టూడెంట్ అఫైర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.కృష్ణమోహన్ అధ్యక్షతన వీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, నాస్కామ్ డైరెక్టర్ ఉదయ్‌శంకర్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రొఫెసర్ నైపుణ్యాలు, వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లు, హ్యాక్‌ధాన్, పరిశ్రమ లీడర్ సెషన్ కోర్సులు ఉచితంగా అందజేస్తామని వీసీ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులలో డిజిటల్ నైపుణ్యాలను శక్తివంతమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ వీవీ సుబ్బారావు, ఓఎస్‌డీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు సహదేవయ్య, బీటీ కృష్ణ, స్వర్ణకుమారి, పద్మజారాణి పాల్గొన్నారు.