
అవగాహన కల్పిస్తున్నాం
ఇన్‌స్పైర్ మనాక్ పోటీల్లో ప్రాజెక్టులను ఎంపిక చేయడానికి జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటు యాప్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశాను. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాజెక్టుల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికై నా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తొందరపడాలి.
– జీవీఎస్ సుబ్రహ్మణ్యం,
జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నిర్లక్ష్యం చేయడం తగదు
ఇన్‌స్పైర్ మనాక్ నామినేషన్లకు సంబంధించి అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్పందించాలి. సైన్స్ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని నామినేషన్లను త్వరితిగతిన పూర్తి చేయాలి. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు నామినేషన్లు వచ్చేలా చూడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా,
జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

అవగాహన కల్పిస్తున్నాం