
ఎరుకల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంగడాల
పిఠాపురం: ఎరుకల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ కోరారు. కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ విమోచన దినోత్సవాన్ని పిఠాపురంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు అనుభవిస్తున్న వివిధ సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఎరుకల జాతి వారు బాగా వెనకబడిన తెగల్లో ఉన్నారని, వాళ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం కార్యదర్శి భారతి మాచరయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాడ దుర్గ, జిల్లా ట్రెజరర్ అమలదాసు వెంకట లచ్చన్న, ముఖ్య సలహాదారు సింగం రవి, గౌరవ అధ్యక్షుడు భారతి నాగేశ్వరావు, కాకినాడ జిల్లా మీడియా కన్వీనర్ గాడా సత్తిబాబు, పిఠాపురం మండల అధ్యక్షులు అమలదాసు నాగేశ్వరావు, భారతి గంగరాజు, అమలదాసు సత్యనారాయణ, భారతి మంగతాయారు, అమలదాసు దుర్గ, భారతి దుర్గ తదితరులు పాల్గొన్నారు.