
మరిడమ్మ దర్శనానికి భారీగా భక్తులు
పెద్దాపురం: భక్తుల కల్పవల్లిగా ఖ్యాతికెక్కిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గురువారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూ లైన్లలో బారులు తీరి మరీ అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు.
ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి
కాకినాడ సిటీ: మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన, చైతన్యం పెంపొందించేలా జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాటి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) టీమ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ టీమ్ మత్తు పదార్థాలు వాడే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులతో ఈగల్ క్లబ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, ఎస్‌ఎస్‌ఏ పీఓ వేణుగోపాలరావు, ఈగల్ టీమ్ అధికారి కె.ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.
1.03 లక్షల మందిని
అక్షరాస్యులను చేయాలి
కాకినాడ సిటీ: అక్షరాస్యత కార్యక్రమాల్లో అధికారులందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లో నిర్వహించిన క్యాస్ట్ సర్వే ద్వారా జిల్లాలో 3,39,963 మంది వయోజనులైన నిరక్షరాస్యులను గుర్తించారన్‌న్రాు. వారిలో మొదటి విడతగా ఈ ఏడాది 1,03,081 మందిని అక్షరాస్యులుగా చేయడానికి ఆయా శాఖల ద్వారా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. తదుపరి మూడు సంవత్సరాల్లో మిగిలిన అందరినీ అక్షరాస్యులుగా చేయాలని సూచించారు. జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి అనిశెట్టి వెంకటరావురెడ్డి మాట్లాడుతూ, రెండో దఫా అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమం కింద ప్రతి పది మందికి ఒక వలంటీర్ టీచర్‌ని ఏర్పాటు చేసి, ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకూ ఒక రోజు జిల్లా స్థాయి శిక్షణ నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 6 వరకూ మండల స్థాయిలో వలంటీర్ టీచర్లు, రిసోర్స్ పర్సన్లకు ఎంపీడీఓల ఆధ్వర్యాన శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 7 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ నిరక్షరాస్యులకు ఫైనాన్షియల్, డిజిటల్, ఫంక్షనల్ లిటరసీల్లో శిక్షణ ఇచ్చి, మార్చి నెలలో పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ
విభాగాల్లో చోటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లా నుంచి ముగ్గురికి స్థానం కల్పించారు. పార్టీ వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జల్లిగంపల ప్రభాకర్ (ప్రత్తిపాడు నియోజకవర్గం), రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శులుగా అల్లవరపు నాగమల్లేశ్వరి, పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజులను (పిఠాపురం నియోజకవర్గం నియమించారు.

మరిడమ్మ దర్శనానికి భారీగా భక్తులు

మరిడమ్మ దర్శనానికి భారీగా భక్తులు