
ఎక్కడ పనులు అక్కడే..
స్మార్ట్ సిటీ నిధులు విడుదల చేయకపోవడంతో నగరంలో పలు అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండిపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్పొరేషన్ భవనం సైతం మధ్యలోనే నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా నిధులు లేవని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ సిటీ గడువు పెంచి, నిధులు విడుదల చేయాలి.
– నల్లబిల్లి సుజాత, మాజీ కార్పొరేటర్