● 5 మండలాల్లో మినహా
మిగతా చోట్ల వంద శాతానికిపైనే..
● రుణాలతో వివిధ రకాల
వ్యాపారాల యూనిట్లు
● స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు
● ఆర్థిక సంవత్సరం
ఆరంభం నుంచే ప్రత్యేక దృష్టి
●
గద్వాల న్యూటౌన్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి నాలుగు మున్సిపాలిటీల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు మండలాలు మినహా లక్ష్యం మేరకు రుణాలు అందించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ ఉంటుంది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల రుణ లక్ష్యం 5,765 సంఘాలకు రూ.206.02 కోట్లు లక్ష్యం ఉండగా.. 2,277 సంఘాలకు రూ.218.28 కోట్లు అందించారు.
బ్యాంకుల ద్వారా మంజూరు
ప్రతి గ్రామంలో 10 నుంచి 15 మంది మహిళలు కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడుతారు. ఈ సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వారా గ్రూపు రుణాలు అందిస్తారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందే మహిళలు వారు నిర్వహించుకునే వ్యాపారాలు సూచిస్తూ బ్యాంకు లింకేజీ కింద బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. డోస్‌ల వారీగా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. బ్యాంకర్లు ఇచ్చిన అప్పులకు 12 నుంచి 14 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఇందిరా మహిళా శక్తి పథకం..
రాష్ట్ర ప్రభుత్వం 2024– 25లో ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. 2025– 26లో వ్యక్తిగత యూనిట్లతోపాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహించారు. ఈ పథకం కింద 2025– 26లో క్యాంటీన్లు, కిరాణాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్లు, పాడి, చీరలు, స్వీట్, పచ్చళ్ల దుకాణాలు, అగర్ బత్తీలు, రోటీ మేకింగ్ సెంటర్లు తదితర వాటిని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు.
మండలం సంఘాలు అందించిన రుణం
(రూ.కోట్లలో)
గద్వాల 222 25.29
ధరూర్ 266 28.20
వడ్డేపల్లి 102 12.40
ఉండవెల్లి 197 17.04
మానవపాడు 231 16.82
మల్దకల్ 254 25.47
అలంపూర్ 129 12.26
రాజోళి 127 12.49
కేటీదొడ్డి 132 13.26
అయిజ 186 17.15
గట్టు 228 19.00
ఇటిక్యాల 203 18.84
పట్టణాల పరిధిలో..
గద్వాల 245 37.39
అయిజ 103 9.92
అలంపూర్ 50 5.99
వడ్డేపల్లి 41 4.99
జిల్లాలోని పట్టణాల్లో నెరవేరిన లక్ష్యం


