మానవపాడు: జాతీయ ఉపాధి హమీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీల్లో తప్పకుండా వందమందికిపైగా కూలీలకు కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని బోరవెల్లి, పల్లెపాడు, జల్లాపురం గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు ఎంత మంది వస్తున్నారు.. వేతనాలు ఎంత వస్తున్నాయి.. ఎంతమంది ఎన్ని పని దినాలు పూర్తి చేశారు అని ఆరా తీశారు. ప్రతిఒక్కరికీ పనిదినాలు కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ప్రతి గ్రామంలో దాదాపు వందమంది కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీల్లో రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఫీల్ట్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.


