‘108’కు కృతజ్ఞతలు.. | - | Sakshi
Sakshi News home page

‘108’కు కృతజ్ఞతలు..

Apr 5 2026 8:00 AM | Updated on Apr 5 2026 8:00 AM

‘108’కు కృతజ్ఞతలు.. 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఎందరో ప్రాణాలు కాపాడా..

మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు.

– గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద

15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం.

– సి.శ్రీనివాస్‌, పైలట్‌, నారాయణపేట

108 వాహనంలో టెక్నీ షియన్‌గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

– పి.రాజ్‌కుమార్‌,

ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌,

నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement