గద్వాల: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘాల ద్వారా అమలుచేస్తున్న ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 పథకాల నమోదుకు దరఖాస్తు గడువును వచ్చేనెల 2వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు లింకేజీతో రవాణా విభాగానికి సంబంధించి ద్విచక్ర వా హనాలు, త్రీచక్రాల గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, వ్యవసాయ రంగంలో అగ్రి డ్రోన్ సేవలు, అగ్రి మెషినరీ కామన్ హైరింగ్ సెంటర్లు, సో లార్ పంప్‌సెట్లు, ఇతర అనుబంధ వ్యవసాయ పథకాలు ఉన్నట్లు పే ర్కొన్నారు. పశుసంవర్థక రంగంలో పాడిపశువులు, సెరికల్చర్, హార్టికల్చర్ పథకంలో మల్బరీసాగు, చౌకీసెంటర్లు, కిసాన్ నర్సరీలు, కూర గాయలు, ఆయిల్‌పాం పెంపకం వంటి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. బ్యాంక్ లింకేజీ లేని పథకాల్లో మైనర్ ఇరిగేషన్, ఎంటర్‌ప్రైజేషన్ కింద బోర్‌వెల్‌లకు సబ్మర్సిబుల్ పంప్‌సెట్లు, పైప్‌లైన్ ఏర్పాట్లు, సర్వీస్ కనెక్షన్ చార్జీలు. ఓఆర్సీ లైనింగ్ వంటి సదుపాయాలు రూ. 1.50లక్షల వరకు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చేనెల 2వ తేదీలోగా ఎస్సీ కార్పొరేషన్ అధికారిక ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్ని గ్రామాలకు
బస్సు సౌకర్యం కల్పించండి
గద్వాల: నియోజకవర్గంలో ని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రయాణికుల కోసం బస్టాండ్ నిర్మించడంతో పాటు గద్వాలకు ఎలక్ట్రిక్ బస్సులను అధిక మొత్తంలో కేటాయించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ నిర్మించాలని, బస్టాండ్‌లో మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.


