చట్టాలపై అవగాహన తప్పనిసరి
మానవపాడు: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జూనియర్ సివిల్‌జడ్జి ఆర్‌వీఎస్ మిథున్ తేజ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దపోతులపాడులో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. యువత సన్మార్గంలో పయనిస్తూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడొద్దని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసులు, న్యాయవాదులు టి.నారాయణరెడ్డి, కేవీ తిమ్మారెడ్డి, గజేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


