ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎండీ అక్బర్ అన్నారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ సౌజన్యంతో అయిజ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా రైతులు ఎలాంటి పంటలు సాగుచేసినా అధిక పెట్టుబడులు, తక్కువ దిగుబడులతో నష్టపోతున్నారని అన్నారు. రైతులకు వ్యవసాయం గుదిబండగా మారిన నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్‌పాం సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఆయిల్‌పాం తోటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. మరోవైపు క్రిమిసంహారక మందుల వాడకం తగ్గి.. భూ సారం పెరుగుతుందన్నారు. రైతులు లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శివనాగిరెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్లు మహేశ్, రాజశేఖర్, ఏఓ జనార్దన్, ఫీల్డ్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, మంజునాథ్, మేఘారెడ్డి, శివకుమార్, శశిధర్, సింగిల్‌విండో కార్యదర్శి మల్లేశ్ పాల్గొన్నారు.


