ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
గద్వాలటౌన్: గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్‌ఓ) కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అండర్–14, 17 బాలురు, బాలికల క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను వారు ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయం అనంతరం వారు మాట్లాడారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలలో రాణించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఈటీలు హైమావతి, శ్రీనివాసులు, నగేష్‌బాబు, బషీర్, బీసన్న, స్రవంతి, జగదీష్, సతీష్, సుహాసిని, దేవేందర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి


