పాగుంట ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

పాగుంట ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

Oct 27 2025 8:24 AM | Updated on Oct 27 2025 8:24 AM

పాగుం

పాగుంట ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో వెలసిన శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆదివారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ హజరై ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెను సన్మానించి తీర్ధప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు బండల వెంకట్రాములు, రామచంద్రరెడ్డి, రాజేష్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి, కిష్టన్న, శ్రీపాదరెడ్డి, ఎర్రబీంరెడ్డి, తదితరులు ఉన్నారు.

బీసీ రిజర్వేషన్ల

సాధనకు సదస్సు

గద్వాల: బీసీ రిజర్వేషన్ల సాధనకై నవంబర్‌ 9వ జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని టీజేఎస్‌ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, బీసీలపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత విధానాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 9వ తేదీన గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈసదస్సుకు బీసీలు అధిక సంఖ్యలో హాజరై జయపద్రం చేయాలని కోరారు. దేశావ్యాప్తంగా 56శాతం ఉన్నబీసీలకు శాసీ్త్రయ కోణంలో కులగణన నిర్వహించి జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయించి వారిని అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సబ్బండ జాతులు ఏకం కావాలని కోరారు. బీసీల వ్యతిరేక పార్టీ బీసీల ద్రోహి బీజేపీ చేస్తున్న దొంగనాటకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రిజర్వేషన్లను ముందు నుంచి కూడ వ్యతిరేకిస్తున్న బీజేపీ మనువాద విధానాల అమలులో భాగంగా బీసీలను రిజర్వేషన్లకు దూరం చేసేవిధానాలను చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని దూరం చేయడంలో మొదటి ద్రోహి బీజేపీయో అని అన్నారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఆఘమేఘాల మీద చట్టాలను సవరించిన కేంద్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మోసపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుబాబు, వెంకటస్వామి, అతికూర్‌ రహమాన్‌, ప్రభాకర్‌, సుభాన్‌, కుర్వపల్లయ్య, ఉప్పేరు నర్సింహా, వినోద్‌, గోపాల్‌యాదవ్‌, చిన్న, టవర్‌ మక్బుల్‌, దామోదర్‌, కృష్ణ, రాకేష్‌, లివింగ్‌స్టన్‌, లక్ష్మన్న పాల్గొన్నారు.

పెన్షనర్ల సమస్యలపరిష్కారానికి పోరాటం

అలంపూర్‌: రిటైర్డు ఉద్యోగుల పెన్షన్‌ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని రిటైర్డు ఉద్యోగుల సంఘం నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు మద్దిలేటి, కార్యదర్శి సదానందమూర్తి అన్నారు. అలంపూర్‌ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రిటైర్డ్‌ ఉద్యోగులు తమ పెన్షన్‌ల సమస్యలు తమ దృష్టికి తీసుకరావాలన్నారు. ఎస్టిఓ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రిటైర్డు ఉద్యోగుల పెన్షన్‌ మధ్యలో నిలిచిన, పూర్తిగా రాకపోయిన తమను సంప్రదించాల్సిందిగా తెలిపారు. పెన్షన్‌ దారులను ఎస్టీఓ కార్యాలయంలో ఇబ్బందులకు గురిచేసే వారిని సహించేది లేదన్నారు. జిల్లాలోని 2500 వందల మంది పెన్షన్‌ దారులు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన డబ్లులు వారి ఖాతాల్లో జమ కావడం లేదన్నారు. దీంతో రిటైర్డు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి వారి డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్‌మెంట్‌ డబ్బులు సకాలంలో రాకపోవడంతో కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని అందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన డీఏలను పెన్షన్‌దారులకు ఇవ్వాలన్నారు. నియోజకవర్గ రిటైర్డు ఉద్యోగుల నూతన కార్యకవర్గం ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఎన్నిక తేదిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

పాగుంట ఆలయంలో  ఎంపీ ప్రత్యేక పూజలు 
1
1/1

పాగుంట ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement