మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం

Oct 27 2025 8:24 AM | Updated on Oct 27 2025 8:24 AM

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం

ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో

వసతులు కల్పిస్తాం

ధరూరు: అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్వాసితుల కొరకు నూతనంగా ఏర్పాటవుతున్న ర్యాలంపాడు ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో రూ.30లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన మిషన్‌ భగీరథ ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆదివారం ఆయన మండల పరిరిఇలోరని ఓబులోనిపల్లి గ్రామ శివారులో కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. ముంపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 90వేల లీటర్ల సామర్థ్యంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నామన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 4టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన బాధితుల త్యాగం మరువలేనిదన్నారు. అక్కడి రైతుల రుణం ఎంతిచ్చినా తీర్చకోలేమన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సుదర్శన్‌రెడ్డి, హనుమంతు, రాజశేఖర్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములు, విజయ్‌రెడ్డి, పురుశోత్తంరెడ్డి, నాగన్న, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

గద్వాల వ్యవసాయం: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలోని సంగాల రిజర్వాయర్‌ వద్ద ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, ఇతర నాయకులతో కలిసి రిజర్వాయర్‌లో చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేపపిల్లలను సరఫరా చేసిందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో నదుల శాతం తక్కువగా ఉన్నప్పట్టికి, ఉన్న నీటివనరులను సద్వినియోగం చేసుకొని చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అన్ని చెరువులను అభివృద్ది చేసి చేపపిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రోత్సాహన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ కురువ హనుమంతు, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీచైర్మన్‌ గట్టు తిమ్మప్ప, మాజీ జడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాభానో, జమలమ్మ ఆలయ కమీటీ చైర్మన్‌ వెంకట్రాములు, మాజీ ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బాబర్‌ మత్స్యకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement