యాసంగికి సంసిద్ధం
జిల్లాలో 1,95,516 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈ ఏడాది (2025–26) యాసంగి సాగుకు రైతులు సిద్ధం అయ్యారు. 1,95,516 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాలపాలు అయ్యారు. జరిగిన నష్టాన్ని దిగమింగుకొని యాసంగి సీజన్ అయినా గట్టెక్కిస్తుందన్న గంపెడు ఆశతో పంటలు వేయడానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల దుక్కులు దున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు సైతం వేశారు.
కన్నీరు మిగిల్చిన వానాకాలం
గడిచిన ఏడాది 2024–25 వానాకాలం (ఖరీఫ్), యాసంగి సీజన్‌లు రైతులకు కలిసొచ్చాయి. వానాకాలంలో సమయానుకూలంగా వర్షాలు కురిశాయి. బోర్లు, బావులు రీచార్జి అయ్యాయి. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలం కావడంతో ఆ ఏడాది వానాకాలం సీజన్, యాసంగి సీజన్ సాగు సాఫీగా సాగింది. పత్తి, కంది, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే 2025 వానాకాలం సీజన్ (ఖరీఫ్) రైతులకు కన్నీరు తెప్పించింది. ఆరంభంలో వర్షాలు కురవలేదు. ఆ తర్వాత ప్రధానంగా జులై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటలపై పడింది. పలుచచోట్ల నీరు నిల్వ అయి మొక్కల ఎదుగదలపై ప్రభావం పడింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లోనూ కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్ళు, వైరస్‌లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఎక్కువగా సాగు చేసిన పత్తి పంట దిగుబడులు సగానికి పడిపోయాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి తడిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలం సీజన్‌లో సాగు చేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి, రైతులను ఆర్థికంగా నష్టాల పాలు చేసింది.
కంది 1320
కొర్ర
372
పెసర
150
ఇతర పంటలు 181
యాసంగిపైనే ఆశలన్నీ..
అంచనా మేరకు సాగు
యాసంగి సీజన్ జిల్లాలో ఇప్పటికే ఆరంభించారు. బోర్లు, బావుల కింద సాగు బాగా జరుగుతుందని భావిస్తున్నాం. వరి, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ పంటలు ఎక్కువగా వేయనున్నారు. అంచనా మేరకు పంటలు సాగు అయ్యే అవకాశం ఉంది.
– జగ్గు నాయక్, ఇన్‌చార్జ్ డీఏఓ
ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసిన రైతులు
అతివృష్టితో కలిసిరాని వానాకాలం సీజన్
గంపెడాశలతో విత్తనాలు వేసిన అన్నదాతలు
వానాకాలం సీజన్ నిరాశ కల్గించినప్పట్టికి ఆభాదను దిగమింగుకొని 2025–26 యాసంగి సీజన్ సాగుకు జిల్లాలో రైతులు సిద్ధమయ్యారు. వరి, పప్పుశనగ, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఈసీజన్‌లో ప్రధానంగా వేయనున్నారు. 1,95,516 ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వానాకాలంలో కురిసిన విస్థారమైన వర్షాల వల్ల బోర్లు, బావులు రీజార్జ్ అయ్యాయి. దీంతో వీటి కింద రైతులు ఇప్పటికే సాగుకు సిద్ధంఅయ్యారు. జిల్లాలోని పలు చోట్ల దుక్కులు దున్నుతున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు వేశారు. చాలా చోట్ల వచ్చే నెల మొదటి, రెండో వారం నుంచి విత్తనాలు వేయనున్నారు. వానాకాలంలో వేసిన వరి పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నందు వల్ల, ఇది పూర్తి అయ్యాక నారు పోయనున్నారు. అయితే కొన్ని చోట్ల నారుమడులు సిద్దం చేస్తున్నారు. ఈసారి యాసంగిలో అధికంగా వరి పంట వేయనున్నారు. దీని తర్వాత మొక్కజొన్న వేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 50వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయ్యే అవకాశం ఉంది. నల్లరేగడి భూముల్లో మొక్కజొన్న, పప్పుశనగ ఎక్కువగా సాగు చేస్తారని అధికారుల అంచనాగా ఉంది. వీటితో పాటు కూరగాయల సాగుకు కూడా రైతులు సమాయత్తమయ్యారు. కొన్నిచోట్ల నారునాటతున్నారు. ఇదిలా ఉంటే యాసంగి సీజన్‌లో పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యాసంగికి సంసిద్ధం


