
ట్రాన్స్‌ఫార్మర్ కోసం లంచం
వంగూరు: మితిమీరిన అవినీతికి పాల్పడుతూ రైతులను, విద్యుత్ వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్న విద్యుత్ శాఖ లైన్‌మన్ నాగేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ కావాలని నాలుగు నెలల క్రితం నాలుగు డీడీలకు డబ్బులు చెల్లించాడు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ బిగించడంలో లైన్‌మన్ నాగేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిత్యం ట్రాన్స్‌ఫార్మర్ కోసం లైన్‌మన్‌ను కలవగా నాలుగు డీడీలకు రూ.20 వేలు అయినప్పటికీ అదనంగా రూ.10 వేలు తీసుకున్న లైన్‌మన్ సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకుండా మరో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వంగూరు గ్రామ శివారులోని మద్యం దుకాణం ఎదుట రైతు రూ.15 వేల నగదునాగేందర్‌కు ఇస్తుండగా సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి తరలించారు. నాగేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, జిలానీ తదితరులు పాల్గొన్నారు.
చదువుతోపాటు
క్రీడలు ముఖ్యం
గద్వాలటౌన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని అన్నారు. క్రీడలతో పట్టుదల, శ్రద్ధ అలవడుతాయన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను జోనల్, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయా మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
● ఏసీబీకి చిక్కిన లైన్‌మన్ నాగేందర్
● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

ట్రాన్స్‌ఫార్మర్ కోసం లంచం