
కొనసాగుతున్న మద్యం టెండర్ల దాఖలు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ కొనసాగుతుంది. మొత్తం 227 ఏ4 దుకాణాలకు గాను గత నెల 26 నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 508 టెండర్లు వచ్చాయి. ఇందులో మంగళవారం 53 దరఖాస్తులు వచ్చాయి. కాగా.. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.15.24 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి భారీ మొత్తంలో టెండర్లు వేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్వల్పంగా వేసిన వ్యాపారులు రాబోయే మూడు రోజుల్లో భారీగా వేయడానికి సిద్ధపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్ర వ్యాపారులు సైతం స్థానికులతో కలిసి టెండర్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
23న లక్కీ డ్రా
గద్వాల: జిల్లాలోని 34 మద్యం దుకాణాలకు ఈ నెల 23న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా 2025–27 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదలచేసి.. సెప్టెంబర్ 26 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 23న ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా మంగళవారం మొత్తం
వచ్చినవి టెండర్లు
మహబూబ్‌నగర్ 18 186
జోగుళాంబ గద్వాల 18 111
నాగర్‌కర్నూల్ 2 107
నారాయణపేట 5 57
వనపర్తి 10 47

కొనసాగుతున్న మద్యం టెండర్ల దాఖలు